Reading Time: < 1 minute

హైదరాబాద్: బిఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ గా ఉండేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, హైదరాబాద్ వాతావరణం చాలా బాగుంటుందని అన్నారు. అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ గురించి తలసాని మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. మళ్లీ హైదరాబాద్ తిరిగొస్తేనే హాయి అని.. బిఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ప్రగతి సాధించిందని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయకత్వంలో సిటీ రోడ్లు బ్రహ్మాండంగా తయారయ్యాయని తెలియజేశారు. మళ్లీ రోడ్లకు దుర్దశ వచ్చిందని, గంటల తరబడి రోడ్లపై నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బిఆర్ఎస్ పాలనలో రూ.70 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి జరిగిందని, రెండేళ్ల లో హైదరాబాద్ నగరం అధ్వానంగా తయారైందని మండిపడ్డారు. నగరంలో ఎస్టిపిలు కట్టిందే బిఆర్ఎస్ ప్రభుత్వం అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.