Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: భారత మహిళల జట్టు త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. సఫారీలతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) భారత జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుండగా.. సీనియర్ ప్లేయర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన WPL (మహిళల ప్రీమియర్ లీగ్) సీజన్‌లో మంచి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న అనుష్క శర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు.  ఈ సీజన్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అనుష్క శర్మ ఎంట్రీ ఇవ్వనుంది.

కాగా, ఇరుజట్ల మధ్య ఏప్రిల్ 17, 19, 22, 25, 27 తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి రెండు T20I మ్యాచ్‌లు డర్బన్‌లో జరగనుండగా, మూడు నాలుగు మ్యాచ్‌లు జోహన్నెస్‌బర్గ్‌లో నిర్వహించనున్నారు.చివరి T20I మ్యాచ్ బెనోనిలో జరుగుతుంది.

జట్టు వివరాలు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుణ్ధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కాష్వీ గౌతమ్, భారతి ఫుల్మాలి, ఉమా ఛెత్రి, అనుష్క శర్మ.