
జైపూర్: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాగ్ పరాగ్ కెప్టెన్‌గా ఉండడంతో ఆయనపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం ఐపిఎల్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రాణించలేదని, ఐనా కూడా అతడిని రాజులా జట్టు చూసుకుంటుందని చురకలంటించారు. రియాగ్ ఎలా కెప్టెన్ అయ్యాడో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. 2024 ఐపిఎల్‌లో అతడి ప్రదర్శన బాగుందని కితాబిచ్చాడు. యశస్వి జైస్వాల్- వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ ఆర్‌ఆర్‌కు పెద్ద బలమని శ్రీకాంత్ తెలియజేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు మంచి జట్టే కానీ ప్రమాదకర జట్టు కాదని పేర్కొన్నారు. ఆర్‌ఆర్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు టాప్ ఫైవ్‌లో ఉంటే జట్టు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఐపిఎల్ కప్‌ను గెలిచే జట్టు మాత్రం ఆర్‌ఆర్ కాదు అని, ప్లేఆఫ్‌కు కూడా అర్హత సాధించే అవకాశాలు ఫీప్టీ- ఫీఫ్టీగా ఉన్నాయని కృష్ణమాచారి శ్రీకాంత్ వివరించారు.