
హైదరాబాద్: జవహర్ నగర్ ప్రాంతం తన గుండెకాయ అని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. హైదరాబాద్ చెత్త అంత అక్కడే వేస్తున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ఆయన ప్రస్తావించారు. ఇన్ చార్జి మంత్రి శ్రీధర్ బాబు అంటే తనకు చాలా అభిమానం అని తెలియజేశారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హయాంలో ఏర్పాటు చేశారని, మేడ్చల్ నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశారని విమర్శించారు. జవహర్ నగర్ చెత్తతో రెండున్నర లక్షల మంది అవస్థలు పడుతున్నారని, వాసన భరించలేకపోతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానా అని అనిపిస్తుందని, తనపై కుట్ర పన్నుతున్నారని మల్లారెడ్డి ధ్వజమెత్తారు.