
హైదరాబాద్: గంభీర్ కోచ్‌గా ఉన్నప్పుడు టి20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకుందని భారత జట్టు మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌కు కోచ్ గంభీర్‌కు అతి పెద్ద సవాల్ ఎదురుకానుందన్నారు. సౌతాఫ్రికాలో పరిస్థితులు అత్యంత కఠినంగా ఉండడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తాయని వివరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టెస్టు క్రికెట్ విషయానికి వస్తే ఫిచ్ గురించి అతిగా ఆలోచించడం మంచిది కాదని హితువు పలికారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను ఉదాహరణగా తీసుకొని టర్నింగ్ పిచ్‌లపై ఆడాల్సిన అవసరం భారత జట్టుకు లేదని తెలియజేశారు. మంచి పిచ్‌లపైన ఆడితే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. గంభీర్ కొన్ని విషయాలలో కఠినంగా ఉండాల్సిన అవసరం లేదని, ఆయన చాలా మంచి మనిషి… పోటీతత్వం వచ్చేసరికి కొంచెం కఠినంగా ఉండొచ్చని సలహా ఇచ్చాడు. అతడు వ్యక్తి కంటే టీమిండియాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని మెచ్చుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఇలాంటి వాతావరణం ఉండేటట్లు చూసుకోవాలని సలహా ఇచ్చాడు. ఐపిఎల్ సమయంలో విరాట్ కోహ్లీతో గంభీర్ దూకుడుగా ఉండేవాడు. గంభీర్ దూకుడు ఒక్కోసారి ఘర్షణలకు దారితీసిన విషయం తెలిసిందే.