Reading Time: < 1 minute

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో లాగార్డియా విమానాశ్రయంలో అగ్నిమాపకయంత్రాన్ని విమానం ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ అనే విమానం రన్ వేపై దిగుతుండగా అదే సమయంలో అగ్నిమాపకయంత్రం రన్‌వేపైకి రావడంతో ఢీకొన్నాయి. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ మృతి చెందాడు. రన్‌వేపై ట్రక్కు, విమానం పక్కపక్కనే ప్రయాణిస్తున్నాయి. ట్రక్కును విమానం ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ మంటల్లో పైలట్, కో పైలట్ సజీవదహనమయ్యారు. 24 మైళ్ల వేగంతో విమానం ప్రయాణిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా స్పందించారు. ఇది చాలా భయంకరమైన ప్రమాదం అని ట్రంప్ అభివర్ణించారు. ఈ ఘటనపై రెండు దేశాలు కలిసి దర్యాప్తు చేస్తున్నాయని విమానయాన శాఖ పేర్కొంది.