
డిఫరెంట్ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్.. రైటర్,- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని చేకూరుస్తూ, దిల్ రాజు థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ డేట్ ప్రకటన ప్రెస్ మీట్‌లో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ “టీజర్ చాలా నచ్చింది. తర్వాత మొత్తం కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. దీంతో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మేము రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాం.
మంచి హాస్యం ఉన్న సినిమా ఇది. ఈ సినిమాని మా ఎస్విసి ద్వారా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నాం. మే 1 ఈ సినిమా రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ ప్రకటించడం జరిగింది. అయితే దానికి కూడా కండిషన్స్ అప్లై. ఎందుకంటే ఇదివరకే ఏప్రిల్ 30కి పెద్ది సినిమా విడుదల అని ప్రకటించారు. ఆ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమాకి థియేటర్స్ మేమే ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కండిషన్స్ అప్లై అని చెప్పాము. మళ్ళీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరమనకుంటే ఒక వారం రోజులు వెనక్కి జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది”అని అన్నారు. ప్రొడ్యూసర్ భాను కిరణ్ మాట్లాడుతూ తమలాంటి యంగ్ ఫిలిం మేకర్స్‌ని సపోర్ట్ చేస్తున్న దిల్ రాజుకి ధన్యవాదాలు అని తెలిపారు. పవన్ సాదినేని మాట్లాడుతూ “ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.