Reading Time: < 1 minute

జగిత్యాల: ఎంఎల్ సి జీవన్ రెడ్డికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, ఎఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ లు జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనతో మాట్లాడుతున్నారు.  పార్టీ మార్పుపై పట్టు వీడేదిలేదని, ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని గతంలో జీవన్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. మంత్రి శ్రీదర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ను పార్టీలో కొనసాగాలని కోరడంతో మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ససేమిరా అనడంతో పాటు నిర్ణయంలో మార్పులేదని, పూర్తి వివరాలు 25న వెల్లడిస్తానని జీవన్ రెడ్డి అన్నారు.  కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే.  రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.