
మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్- ఇండి యా మూవీ ‘ఎస్‌వైజి’ (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ లెవెల్‌లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. సోమవారం శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన్ని బ్రిటిషుగా పాత్రలో చూపిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రతి గా యాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడుగా ఆయన లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వ స్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ పాన్- ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది సంబరాల ఏటిగట్టు సినిమా.