Reading Time: < 1 minute

యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నా రు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. పోస్టర్లు, గ్లింప్స్, టీ జర్, అలాగే మొదటి సాంగ్ ‘రుబారు’.. అన్నీ ప్రే క్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. డెకాయిట్ సెకండ్ సింగిల్ చిచ్చుబుడ్డి మార్చి 28న రిలీజ్ కానుంది. ఇది అదిరిపోయే డాన్సింగ్ నెంబరు. ఈ సాంగ్‌లో అడివి శేష్ డాన్సింగ్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఈ మూవీని ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతోంది ఈ చిత్రం. ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతున్న ‘డెకాయిట్’ లవ్, హార్ట్‌బ్రేక్, అద్భుతమైన యాక్షన్‌తో ప్రేక్షకులకి మరచిపోలేని అనుభూతిని ఇవ్వనుంది.