
ముంబయి: తనతో కలిసి ఉండడం లేదని స్నేహితుడిని ఓ యువకుడు 20 సార్లు పొడిచి అనంతరం గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ధారావిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అశ్విన్ శివ కుమార్ నాదర్ అనే యువకుడికి అషిక్ అసిమ్ అక్తర్ ఖాన్ అనే స్నేహితుడు ఉన్నారు. ఇద్దరు కలిసి జీవించేవారు. గత కొన్ని రోజులుగా అషిక్‌ను శివ కుమార్ దూరం పెడుతున్నాడు. తనతో కలిసి జీవించాలని పలుమార్లు కోరాడు. శివ నిరాకరించడంతో అతడిపై అషిక్ పగ పెంచుకున్నాడు. శివను కత్తితో 20 సార్లు పొడిచి అనంతరం గొంతు కోసి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.