
హైదరాబాద్: పాతబస్తీలోని షహాలిబండలో హత్యాయత్నం కేసు కలకలం సృష్టించింది. ముగ్గురు పరారీలో ఉన్న నిందితులపై పోలీసులు రౌడీ షీట్లు నమోదు చేశారు. షహబాజ్ ఖాన్, అర్బాజ్ ఖాన్, షహెద్ ఖాన్ లు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. రౌడీషీటర్ అయూబ్ ఖాన్ కుమారులే నిందితులుగా ఉన్నారు. నేర చరిత్ర ఉన్న కుటుంబంగా పోలీసుల గుర్తించారు. నిందితులు ప్రజాశాంతికి ముప్పుగా మారారు. పలుమార్లు ప్రయత్నించినా నిందితులు పట్టుబడడంలేదు. అయూబ్ ఖాన్‌తో కలిసి ముగ్గురు పరారీలో ఉన్నారు. ముగ్గురు గురించి సమాచారం ఇస్తే గోప్యత హామీ కలిగించవని డిసిపి విజ్ఞప్తి చేశారు. కీలక సమాచారం అందించిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. నిందితులకు సహాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీయిజంపై హైదరాబాద్ పోలీసుల ‘జీరో టాలరెన్స్’ హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో వేట కొడవళ్ళతో ఆర్బాజ్ అనే యువకుడు హల్ చల్ చేశాడు. రెండు నెలల క్రితం ముస్లిం మాటర్నిటీ ఆసుపత్రి సమీపంలో “చచ్చా భాయ్ కే బచ్చే హే హమ్” అంటూ ఓ సెల్ ఫోన్ షాపులో యువకులు దౌర్జన్యానికి దిగారు. కేవలం రూ.60 స్క్రీన్ గార్డ్ విషయంపై గొడవ పెట్టుకుని, షాపు యజమానిని బెదిరిస్తూ ప్రతీ నెలా మామూలు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు మళ్లీ దాడి చేసి షాపులో సామగ్రిని ధ్వంసం చేసి ఆర్బాజ్ కు చెందిన గ్యాంగ్ పారిపోయింది. చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.