
అమరావతి: తన కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదని, పోలీసుల విచారణే సక్రమంగా లేదని ఎంపి పుట్టా మహేష్ తండ్రి సుధాకర్ యాదవ్ తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన టిడిపి ఎంపి పుట్టా మహేష్‌కు తండ్రి సుధాకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. సర్జరీ చేయించుకున్న తన కుమారుడు డ్రగ్స్ తీసుకోకూడదని తెలియజేశారు. ఫామ్ హౌస్‌లో పక్కనున్న వారు డ్రగ్స్ తీసుకుంటుంటే వెనక్కి రావాలనుకున్నాడని, కానీ సమయానికి వాహనం అందుబాటులో లేక రాలేకపోయాడని వివరించారు. బ్లడ్ తీసుకోకుండానే బ్లడ్ రిపోర్టులో డ్రగ్స్ అని ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మాజీ ఎంఎల్ఎ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఎంపి పుట్టా మహేష్, మాజీ ఎంఎల్ఎ రోహిత్ రెడ్డితో పాటు మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ ఎస్ పి గిరిధర్ తెలిపారు.