Reading Time: < 1 minute

బోగోటా : కొలంబియాలో ఓ సైనిక రవాణా విమానం సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని దాదాపు 80 మంది సైనికులు చనిపోయ్యారని అధికారులు తెలిపారు. సైనికులను తరలించేందుకు వినియోగించే సి 130 హర్కులస్ విమానం ప్యూర్టో లెగూయి.జమో నుంచి బయలుదేరిన వెంటనే సాంకేతికలోపాలతో కూలింది. మంటలు చెలరేగి , ఇందులోని రెండు ప్లాటూన్ల సైన్యం దుర్మరణం చెందినట్లు కొలంబియా రక్షణ మంత్రి కూడా నిర్థారించారు. ఈక్వెడార్ సరిహద్దుల్లో జరిగిన ప్రమాదానికి కారణాలు వెల్లడికాలేదు. సాధారణంగా ఈ విమానంలో వంద మంది వరకూ సైనికులను కల్లోలిత ప్రాంతాలకు తరలిస్తారు. సరిహద్దులో ఘర్షణల అణచివేతకు సైన్యాన్ని తరచూ వినియోగిస్తున్నారు.