
అమెరికాలో ఎయిర్ కెనడా విమానానికి ప్రమాదం జరిగింది. పైలట్, కో పైలట్ మృతి చెందారు. సోమవారం ప్రాంతీయ జెట్ న్యూయార్క్ లాగార్డియా ఎయిర్‌పోర్టు రన్‌వేపే ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. అక్కడున్న అగ్నిమాపక ట్రక్కుతో ఢీకొంది. ఈ సమయంలో విమానంలో 39 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిని ఇతర సిబ్బందిని వెంటనే చికిత్సకు తరలించారు. కొందరికి ఎక్కువగా కాలిన గాయాలు అయ్యాయి. ఫైర్ ట్రక్కు సిబ్బంది కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటన తరువాత ఈ విమానాశ్రయాన్ని కొద్ది సేపు నిలిపివేశారు.