Reading Time: < 1 minute

గిగ్‌వర్కర్స్, ప్లాట్‌ఫాం కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026’ బిల్లును కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు ప్రకారం గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో

పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ దీనిని ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం పిసిసి అధ్యక్షుడితో పాలు పలువురితో సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సమావేశమయ్యారు. సభలో చర్చించాల్సిన విషయాలు, సభలో సభ్యులు వ్యవహారించాల్సిన తీరు తదితర అంశాలపై కేబినెట్ చర్చించినట్టుగా తెలిసింది.