Reading Time: < 1 minute

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. హేట్‌ స్పీచ్‌ బిల్లుకు, గిగ్‌ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే,పేరెంట్స్‌ సామాజిక భద్రత బిల్లుకు, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు, కులగణనపై నిపుణుల క‌మిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రోహిత్ వేముల చ‌ట్టం విధివిధానాల రూప‌క‌ల్పన‌కు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తీర్మానించింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులుగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనరసింహా, శ్రీధర్‌బాబు వ్యవహరించనున్నారు. ఎల్ అండ్ టీ నుండి మెట్రో స్వాధీనం వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది.