Reading Time: < 1 minute

గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన నగరంలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…పాతబస్తీ, సంతోష్‌నగర్, మెయిన్‌బాగ్‌కు చెందిన సయీద్ లయీక్(31)ను మెయిన్‌బాగ్, మసాన్ గట్టి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. క్లూస్‌టీం వచ్చి ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతోష్ నగర్ పోలీసులు తెలిపారు.