
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ‘హరిహర వీరమల్లు’, ‘ఒజి’ ఈ ఏడాది ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఓవైపు ఎపి డిప్యూటీ సిఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు ఈ సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు పవన్. అయితే పవన్ తదుపరి సినిమాలపై సోషల్‌మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది. సామాజిక అంశాలే ఇతివృత్తంగా సినిమాలు తెరకెక్కించే ఓ దర్శకుడితో పవన్ వర్క్ చేయనున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ‘పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ నిర్మాణ సంస్థ స్పందించింది. పవన్ ప్రస్తుతం ఏ సినిమాకి కమిట్ కాలేదని పేర్కొంది.
‘‘ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఏ కొత్త సినిమానీ అంగీకరించలేదు. ఆయన తదుపరి చిత్రాలపై వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదు. వెంటనే కొత్త సినిమాలు చేయాలన్న ప్రణాళికలు లేవు. ఒకవేళ ఏదైనా ప్రాజెక్టు ఓకే అయితే.. అధికారిక మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియజేస్తాం. ఒక ‘ఒజి2’ అప్‌డేట్‌పై సరైన సమయంలో పవన్‌కల్యాణే దాని గురించి చెబుతారు’’ అని స్పష్టం చేసింది.