Reading Time: < 1 minute

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దానం పార్టీ మారలేదన్న స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసిన బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం నాగేందర్‌ను న్యాయస్థానం ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 16కి వాయిదా వేసింది.

కాగా, పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బిఆర్ఎస్.. స్పీకర్ ఫిర్యాదు చేశారు. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం ఆదేశాల మేరకు దానంతో సహా 10 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. వారికి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.