Reading Time: < 1 minute

ఐపిఎల్ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనింగ్ జోడి సమస్యతో ఇబ్బంది పడింది. ఆరేడు జోడీలను ప్రయత్నించినా.. సఫలం కాలేదు. ఈ ఐపిఎల్‌లో మాత్రం అలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. అందులో భాగంగా పర్మనెంట్ ఓపెనర్‌గా కెఎల్ రాహుల్‌ని ఫిక్స్ చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ హేమంగ్ బదాని తెలిపారు. ప్రి సీజన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపెనింగ్ జోడీనే టి-20 క్రికెట్‌లో కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. ఈసారి ఎలాంటి ప్రయోగాలకు పోవడం లేదని స్పష్టం చేశారు.

2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన కెఎల్ రాహుల్.. ఆ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత టాపార్డర్‌లోకి వచ్చాడు. గత ఎడిషన్‌ో 150 స్ట్రైక్ రేటుతో 539 పరుగులు రాబట్టాడు. ఇటీవల కాలంలో పవర్ గేమ్‌ను మెరుగుపర్చుకున్నాడు రాహుల్. రాహుల్ ఓపెనర్‌గా అదరగొడితే ఢిల్లీకి ఇక తిరుగు ఉండదు. మరోవైపు అతడికి తోడుగా పాథున్ నిశాంక, అభిషేక్ పొరెల్, పృథ్వీషాలో ఒకరు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం లేకపోలేదు.