
హైదరాబాద్: నగరంలోని మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్‌నగర్ కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శృతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మూడో అంతస్థులో ఎసి పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది, రోగులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.