Reading Time: < 1 minute

హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సీజన్‌ కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల అజెండాలో, తొలి బడ్జెట్‌లో పెట్టారని తెలిపారు. కానీ, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12 వేలకు తగ్గించారని ధ్వజమెత్తారు. మూడో పంటకు రైతు బంధు ఇవ్వాలని అడిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక సీజన్‌కే ఇస్తున్నారని పేర్కొన్నారు. ఒక సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాజఫీ చేశామరి గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. మొదటి బడ్జెట్‌లో పెట్టినట్లు ఎకరాకు రూ.15వేల చొప్పున రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే.. రైతు భరోసా, పంటల బోనస్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండో బడ్జెట్‌లో పెట్టిన పంటల బీమా ఈ బడ్జెట్‌లో మాయమైందని అన్నారు.