
పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం లోక్‌సభను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారని.. యుద్ధక్షేత్రంలో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని తెలిపారు. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో 24 గంటల పాటు కంట్రోల్‌రూమ్‌లు, హెల్ప్‌లైన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా వెనక్కు వచ్చారని ప్రధాని తెలిపారు.
ఇక, పశ్చిమాసియాతో భారత్ కు లోతైన వ్యాపార సంబంధాలున్నాయని మోడీ చెప్పారు. భారత్ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోందని తెలిపారు. ప్రస్తుతం మన దగ్గర 53 మిలియన్ మెట్రిక్ టన్నుల రిజర్వ్ నిల్వలు ఉన్నాయన్నారు. హర్మూజ్ నుంచి షిప్స్ సురక్షితంగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాని ప్రధాని మోడీ పేర్కొన్నారు.