Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా మైదానంలో చూడాలని ప్రతీ అభిమానులు భావిస్తాడు. అయితే కొందరికి అది సాధ్యం కాదు. అలాంటి అభిమానుల కోసం బిసిసిఐ చేసే ప్రత్యేక ఏర్పాటే ‘ఫ్యాన్ పార్క్’. ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని.. అక్కడ స్క్రీన్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి అందరికి మ్యాచ్‌ని చూసే సౌకర్యం కల్పిస్తుంది. అలా ఈసారి కూడా 15 నగరాల్లో ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనుంది బిసిసిఐ. అవి కూడా వీకెండ్స్‌లో కావడం మరో విశేషం. అయితే ఈ సారి ఐపిఎల్ తొలి 20 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయడంతో ఫ్యాన్ పార్క్‌లు కూడా మూడు వీకెండ్స్‌లో ఏర్పాటు చేయనుంది.

ఈ ఫ్యాన్ పార్క్‌లో లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్‌తో పాటు వివిధ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తారు. మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఫుడ్ కోర్టులు, చిన్నారుల కోసం ప్లే జోన్‌లను ఏర్పాటు చేస్తారు. వర్చువల్ బ్యాటింగ్, బౌలింగ్ నెట్స్, పేస్ పెయింటింగ్, ఫోటో బూత్స్.. ఇలా అభిమానులను అలరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ ప్యాన్ పార్క్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచన 2015 ఐపిఎల్ సమయంలో బిసిసిఐ అందుబాటులోకి తీసుకొచ్చింది.

మూడు వీకెండ్స్‌తో ఐదేసి నగరాల్లో ఫ్యాన్ పార్క్‌లను బిసిసిఐ ఏర్పాటు చేయనుంది. మార్చి 28 & 29లలో రోహ్‌తక్, భోపాల్, నాగ్‌పూర్, తుమకూరు, కృష్ణానగర్‌లో.. ఏప్రిల్ 4 & 5 తేదీల్లో మథుర, జోద్‌పూర్, మైసూరు, భువనేశ్వర్, నిజామాబాద్‌లో.. ఏప్రిల్ 11 & 12 తేదీల్లో మేరఠ్, నదైద్, రత్నగిరి, కోయంబత్తూర్, రవూర్కెలాలో ఈ ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నారు.