Reading Time: < 1 minute

హైదరాబాద్: బియ్యం ఎగుమతి చేయడానికి పెట్టుకున్న అడ్వయిజర్ ఘరానా మోసగాడు అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. లక్ష మెట్రిక్ టన్నుల ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేస్తామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలోప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి విషమంపై హరీశ్ రావు మాట్లాడారు. ఫిలిప్సీన్ కు బియ్యం పంపడంలో కుంభకోణం జరిగిందని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇడి, సిబిఐ కేసులో నమోదైన వ్యక్తిని అడ్వయిజర్ గా పెట్టుకున్నది నిజామా కాదా? అని ప్రశ్నించారు. నాఫెడ్ అనే సంస్థ కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే డబ్బులు చెల్లిస్తామని అంటే..ఆ సంస్థకు కాకుండా ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

27500 మెట్రిక్ టన్నుల బియ్యం వద్దనే ఎందుకు ఆగిపోయారు? అని.. 7500 మెట్రిక్ టన్నులు ఏడాదిగా పోర్టులో ఉంటే గోదాం, హ్యాండ్లింగ్ ఛార్జీల భారం పడవా? అని..ఆ 7500 మెట్రిక్ టన్నుల బియ్యం ముక్కిపోయాయా.. పురుగులు పడ్డాయా? అని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నదే వాస్తవం అని తెలియజేశారు. నిజాయితీ ఉంటే హౌస్ కమిటీ వేయండి.. నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కాకినాడ పోర్టులో ముక్కిపోయిన బియ్యంతో ఎంతమేరకు నష్టం వాటిల్లిందో చెప్పాలని.. అడ్వాన్స్ డబ్బులు ఇస్తామని కేంద్ర సంస్థ కోరితే ఇవ్వకుండా..ఓ ప్రైవేట్ సంస్థకు ఏ విధంగా ఇస్తారు? అని ప్రశ్నించారు. ఈ విషయంలో హౌస్ కమిటీ వేయాలని కోరుతున్నానని హరీష్ రావు అన్నారు.