
ఢిల్లీ: పశ్చిమాసియాలో కోటిమంది భారతీయులు పనిచేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. యుద్ధం ఎప్పుడు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. లోక్ సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. యుద్ధ క్షేత్రంలో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని, పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని తెలియజేశారు. 24 గంటల పాటు అందుబాటులో కంట్రోల్ రూమ్ లు, హెల్ప్ లైన్లు తో 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా వెనక్కు వచ్చారని, పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. వంటగ్యాస్ సరఫరాకు, ఇంధన భద్రతకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని, గ్యాస్ కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోందని మోడీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం దగ్గర 53 మిలియన్ మెట్రిక్ టన్నుల రిజర్వ్ నిల్వలు మన దగ్గర ఉన్నాయని, హర్మూజ్ నుంచి షిప్స్ సురక్షితంగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
గల్ఫ్ సంక్షోభంపై పార్లమెంటుకు ఒకే వాయిస్ వినిపించాలని, ఇథనాల్ వల్ల ఆయిల్ దిగుమతులు తగ్గుతాయని అన్నారు. రైల్వే విద్యుదీకరణ వల్ల ఆయిల్ వాడకం తగ్గుతుందని, మెట్రో రైల్, ఈ వెహికిల్ వల్ల ఆయిల్ వాడకం తగ్గుతుందని చెప్పారు. ఆయిల్, ఎల్పిజి, ఎరువుల నౌకల ప్రమాణానికి హర్మూజ్ రూట్ కీలకమని, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై మంత్రుల బృందం అప్రమత్తంగా ఉందని అన్నారు. భాగస్వామ్య దేశాలన్నింటితో మాట్లాడుతున్నాం అని.. దేశంలో ఎరువుల కొరత లేదని అన్నారు. రైతులపై యుద్ధ ప్రభావం లేకుండా చేస్తున్నాం అని.. ఖరీఫ్ లో పంటలకు రక్షణ కల్పిస్తున్నాం అని అన్నారు. పశ్చిమాసియాతో లోతైన వ్యాపార సంబంధాలున్నాయని, ప్రతి సవాల్ ను ధైర్యంగా సంయవనంతో ఎదుర్కోవాలి అని నరేంద్ర మోడీ సూచించారు.