Reading Time: < 1 minute

ఆదత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ గతేడాది చివర్లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకి ఇది సీక్వెల్. ఎటువంటి అంచాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ధురంధర్.. విడుదలయ్యాక సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు.. భారీ కలెక్షన్లు సాధించింది. మొదటి భాగం విడుదలైన మూడు నెలల్లోనే రెండో భాగాన్ని విడుదల చేశారు. దీంతో మొదటి భాగం క్రేజ్‌‌తో రెండో భాగం చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. దీంతో పెయిడ్ ప్రీమియర్స్ నుంచి ఈ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది.

విడుదలైన నాలుగు రోజుల్లోనే ‘ధురంధర్-2’ ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్ల వసూళ్లు రాబట్టింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే రూ.43 కోట్లు సాధించిన ఈ సినిమా ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా అత్యధికంగా రూ.115 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది. బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లను (రూ.287 కోట్లు) సునాయాసంగా దాటేసింది. ఓవర్‌సీస్‌లో కూడా దూసుకుపోతుంది. రూ.180 కోట్లు వసూళ్లు రాబట్టింది.

ఇక భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండో చిత్రంగా ‘ధరుంధర్-2’ నిలిచింది. ఈ క్రమంలో బాహుబలి-2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఎడి (రూ.500 కోట్ల) వంటి పాన్ ఇండియా చిత్రాల కలెక్షన్లను దాటేసింది. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో ‘పుష్ప-2’ మాత్రమే ఉంది. పుష్ఫ-2 ఓపెనింగ్ వీకెంట్‌లో రూ.762 కోట్లతో ఈ సినిమా ముందు ఉంది. ప్రేక్షకాదరణ ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.1000, లాంగ్ రన్‌లో రూ.2వేల కోట్ల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రెడ్ వర్గాలు అంచనా వేశాయి.