Reading Time: < 1 minute

హైదరాబాద్: ప్రతి సమస్యనూ తాము మానవీయ కోణంలోనే చూస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదవీ విరమణ ప్రయోజనాలను గత ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బిల్లులు పెండింగ్ విషయంలో భట్టి మాట్లాడారు. ఉద్యోగులను ఇవ్వాల్సిన మూడు డిఎ బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని, రిటైర్ మెంట్ ప్రయోజనాలు చెల్లించకలేకే పదవీ విరమణ వయసు పెంచారని భట్టి విమర్శించారు. దానివల్ల తమ ప్రభుత్వంపై అదనపు భారం పడిందని, గత ప్రభుత్వం రూ.40,154 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిందని, ఉద్యోగులకు కూడా రూ.4,571 కోట్లు బకాయిలు పెట్టారని మండిపడ్డారు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని, తాము వచ్చాక ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని తెలియజేశారు. పెండింగ్ బకాయిల కింద ప్రతి నెలా రూ. 700 కోట్లు ఇస్తున్నామని, మానవీయ కోణం ఉంది కనుకే ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని అన్నారు. ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డు ఇస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.