
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 86,091 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.21 కోట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.