
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సింగర్, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై రూపొందిన ఈ మ్యూజిక్ వీడియో విడుదల వేడుకకు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, హీరో పూరి ఆకాష్, సినీ ప్రముఖులు సమీర్, సాగర్, ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు, మిమిక్రి శివారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ఆడియోను విడుదల చేసి చిత్రబృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద్భ్రంగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ.. ‘దియా ఒక వండర్‌ఫుల్ టాలెంట్. ఈ అరెరే.. అరెరే.. మ్యూజిక్ ఆల్బమ్ చాలా హృద్యంగా ఉంది. ఆమె గాత్రం, నటన రెండింట్లోనూ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కొత్త ప్రతిభలు ముందుకు రావడం తెలుగు సంగీత రంగానికి మంచి సంకేతం. ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ మ్యూజిక్ వీడియోకు క్రాంతి వర్మ దర్శకత్వం వహించగా, కెఅండ్‌ఎం రైటింగ్స్ కథను అందించారు. నిర్మాతగా నూతన్ చెకురి, సంగీతాన్ని శరవణ వాసుదేవన్ సమకూర్చారు. త్వరలోనే ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌తో పాటు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.