
ముంబయి: ఐపిఎల్ 19వ సీజన్ ఇంకా వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సిబి వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. పలు జట్లు ఐపిఎల్ టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ముంబయి ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హార్ధిక్ పాండ్యాకు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పలు సూచనలు చేశాడు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్ధిక్ పాండ్యా తప్పుకోవాలని సలహా ఇచ్చాడు. ఎంఐ యజమాన్యం రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాలతో కలిసి చర్చించాలని సూచించాడు. ప్రపంచ కప్ అందించిన ఇద్దరు కెప్టెన్లు హార్ధిక్ సారథ్యంలో ఆడుతున్నారని, సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ అందిస్తే బాగుంటుందని కృష్ణమాచారి తెలియజేశారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఉన్న టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో హార్ధిక్ ఆటగాడిగా ఉన్నాడని, సూర్యకు కెప్టెన్సీ అప్పగిస్లే ఎంఐ జట్టు పని తేలిక అవుతుందని స్పష్టం చేశారు. తాను మాత్ర సూర్యకు కెప్టెన్సీకే మొగ్గు చూపుతానని కృష్ణమాచారి తెలిపాడు.