
హైదరాబాద్: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. తులం బంగారం రూ.5,950 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350కు తగ్గింది. కిలో వెండి ధర 20 వేల వరకు తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,30,000లుగా ఉంది. మధ్య ప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ద్రవ్యోల్బణ భయాలతోనే బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ట్రేడింగ్ అంతర్జాతీ గోల్డ్ ఔన్సు ధర 4377.95 డాలర్లకు దిగి రావడంతో నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. బంగారం ధర తగ్గడం వరసగా తొమ్మిదో రోజు కావడం గమనార్హం.