Reading Time: < 1 minute

హైదరాబాద్: బిఆర్ఎస్ పాలనలోని అన్ని అక్రమాలపై దర్యాప్తు చేయాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వమే బియ్యం కుంభకోణానికి పాల్పడింది అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ బియ్యం విషయంపై  ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రేమ్ చంద్ గార్గ్ కు, ఫిలిపీయన్స్ కు ఎలాంటి సంబంధం లేదని, సన్నబియ్యానికి బోనస్ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. 72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నగదు చెల్లించామని, ఈ రబీలో కూడా ప్రతి గింజనూ కొంటాం అని అన్నారు. తమది రైతుపక్షపాత ప్రభుత్వం అని.. ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతి చేసిన తొలి రాష్ట్రం మనదే అని ఉత్తమ్ కొనియాడారు. రైతుల నుంచి రికార్డు స్థాయిలో బియ్యం సేకరించామని, ఇంకా మిగిలిన బియ్యం కొంటామని అన్నారు.

86 లక్షల టన్నుల బియ్యం నిల్వ ఉందని.. పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తాము మాత్రం బియ్యాన్ని మంచి ధరకే విక్రయించామని పేర్కొన్నారు. ఇలీవల 72 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేశామని, ఛత్తీస్ గఢ్, ఎపి కంటే మన బియ్యానికే డిమాండ్ ఉందని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా తాము మాత్రం ధాన్యం కొంటున్నామని, మన బియ్యాన్ని థాయిలాండ్, వియత్నాం, కంబోడియాకు పంపిస్తున్నామని అన్నారు. మన సోనామసూరి, బాస్మతి బియ్యానికి మంచి డిమాండ్ ఉందని, రైతుల వద్ద ప్రతి గింజను కొనేందుకు కట్టుబడి ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.