
మన తెలంగాణ,సిటీబ్యూరో: తల్లి రుణం తీర్చుకునేందుకు బిసి బుద్ది జీవులు కదలాలని, బహుజన ఉద్యమకవి, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన బిసి కుల వృత్తుల దీర్ఘకవితల సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ.. బిసిలలో కదలిక వచ్చిందని, దాన్ని సామూహిక శక్తిగా మార్పే పని బిసి సాహిత్య కదలడమంటే తల్లి రుణం తీర్చుకోవడం లాంటిదే అన్నారు. కుల పత్తి సాహిత్యాలు ప్రవాహంగా వస్తున్నాయని,అవి ఇప్పుడు బిసి వాద సాహిత్యంగా రూపుదాల్చాలన్నారు. బీసీ ఉద్యమ జెండాగతా ఎగురవేసే పని బీసీ బుద్ది జీవుల చేతుల్లో ఉందన్నారు. కలుషత ఆహారం తిని భావిభారత బిడ్డలు రాలిపోతుంటే బీసీ సాహత్యకారులు పాలకుల దుర్నితీని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ సాహిత్య వేత్తల కర్తవ్యం విశ్వమానవ విముక్తి గీతమన్నారు.ఈ కార్యక్రమంలో సింగిశెట్టి శ్రీనివాస్, కాళోజి తొలి అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్,ఆచార్య పిల్లల మర్రి రాములు, బహుళమహిళాపక్ష పత్రిక సంపాదకురాలు జ్వలిత, తదితరులు పాల్గొన్నారు.