Reading Time: < 1 minute

ఇజ్రాయెల్ సైన్యం, ప్రధాని నెతన్యాహు ఆందోళన

దేశంలోని దక్షిణప్రాంతపు రెండు ప్రధాన నగరాలపై శత్రువు క్షిపణు దూసుకువచ్చినా తాము పసికట్టలేకపోయామని, వాటిని దెబ్బతీయలేకపోయామని ఇజ్రాయెల్ సైన్యం తమ అశక్తతను అంగీకరించింది. ఈ మేరకు కీలక ప్రకటనను వెలువరించింది. డిమోనా పరిసరాల గగనతలంలోకి తొలిసారిగా ఇరాన్ మిస్సైల్స్ దూసుకురావడంతో దేశ వైమానిక రక్షణ వ్యవస్థ విఫలం అయిందని ఇజ్రాయెల్ సేనలే అంతర్మథనం చెందాయి. ఇప్పుడు తాము ఇజ్రాయెల్ లోతట్టు ప్రాంతంలోకి దూసుకువెళ్లడం అంటే ఈ పోరులో ఇది అత్యంత మలుపు తిరిగే ఘట్టం అయినట్లే అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మెహ్మద్ బఘేర్ గాలిబాఫ్ అరాద్‌పై దాడికి ముందే స్పందించారు. మరో వైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇకపై జరిపే తమ పోరుకు ఇప్పుడు ఇరాన్ జరిపిన దాడి అత్యంత క్లిష్టమైన సవాలును మిగిల్చిందని వ్యాఖ్యానించారు.