Reading Time: < 1 minute

ఇండోర్ (మధ్యప్రదేశ్): ఇండోర్‌లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసకుంది. సాన్వేర్ రోడ్డులోని నర్వాల్ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గిడ్డంగిలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. ఆ గిడ్డంగిలో ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతూ.. దట్టమైన నల్లటి పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. గిడ్డంగి సమీపంలోని కార్మికుల నివాసాలకు ప్రమాదం పొంచి ఉండటంతో.. వారు ముందుజాగ్రత్తగా తమ సామాగ్రిని బయటకు తరలించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పది ఫైరింజన్లతో శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఇండోర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో  8 మంది ప్రాణాలు కోల్పోయారు.