
తెలంగాణలో అన్నదాతలు ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆదివారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతగా 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్లు విడుదల చేసినట్లు సిఎం తెలిపారు. ఒక ఎకరం వరకు రైతులందరికీ ఈ నిధులు జమ కానున్నాయి. అయితే, ఇవాళ ఆదివారం కావడంతో రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో మొత్తం రూ. 9 వేల కోట్లను జమ చేయనుంది.