Reading Time: < 1 minute

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ శాతం లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఉన్న సమయంలో మాత్రమే ఇండియాకు వచ్చి మళ్లీ పూర్తవగానే తిరిగి వెళ్లిపోతున్నాడు. అయితే కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపిఎల్ కోసం విరాట్ ఇప్పటికే బెంగళూరు చేరుకొని అక్కడ సాధన కూడా ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో విరాట్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని కొన్ని డిమాండ్లు చేసినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అందులో ఒకటి బెంగళూరు నుంచి నేరుగా లండన్‌కి ఒక ఛార్టెర్డ్ ఫ్లైట్ కావాలని విరాట్ డిమాండ్ చేసినట్లు కథనాలు పుట్టుకొచ్చాయి.

అయితే దీనిపై విరాట్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘ఈసారి ఐపిఎల్‌కు విరాట్ కోహ్లీ భారీ డిమాండ్లతో వచ్చాడు. మాకున్న సమాచారం ప్రకారం.. భారత్ టు లండన్‌కు ఛార్టర్డ్ ఫ్లైట్‌కి అనుమతి ఇవ్వాలి. మ్యాచ్‌లకు కనీసం మూడు రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఉంటే లండన్‌‌కు పంపాలి. తదుపలి మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు మాత్రమే అక్కడి నుంచి వస్తా’’ అని రాసిన పోస్ట్‌ను విరాట్ షేర్ చేశాడు. దానికి రెండు నవ్వుతూ ఉండే ఎమోజీలను జత చేశాడు. దీంతో విరాట్‌పై వచ్చిన కథనాలు అన్ని అవాస్తవం అని తేలిపోయింది.