
న్యూఢిల్లీ: ఇటీవల జనతా దళ్ యునైటెడ్(జెడియు)కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు కె.సి. త్యాగి.. రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) పార్టీలో చేరారు. ఆదివారం (మార్చి 22) ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో RLDలో జాయిన్ అయ్యారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు త్యాగి, సమతా పార్టీ-జనతా దళ్ విలీనం తర్వాత అక్టోబర్ 2003లో JDU ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీతో ఉన్నారు. గత కొన్నేళ్లుగా, ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి, రాజకీయ సలహాదారు వంటి అనేక కీలక పదవులను నిర్వహించారు.
2013లో త్యాగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2024లో వ్యక్తిగత కారణాలతో ఆయన పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి పదవి నుండి వైదొలిగారు. జేడీయూలో కీలక నేతగా ఎదిగిన త్యాగి.. మార్చి 17న పార్టీకి రాజీనామా చేశారు.