Reading Time: < 1 minute

యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్‌లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. జైన్ మేరీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్‌లో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ను చూసిన అమిర్ ఖాన్ వెంటనే స్పందించి అభినందనలు తెలుపుతూ మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ మూవీని ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ‘డెకాయిట్’ రూపొందుతోంది. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.