
డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ‘ప్రేయసి రావే’ టీం హీరో శ్రీకాంత్, పృథ్వీ, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ .. “మూడు డిఫరెంట్ కథలతో ఈ మూవీని అద్భుతంగా తీశారని అర్థం అవుతోంది. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఈ సినిమాని చూడాలి. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను”అని అన్నారు. దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ .. “ఇప్పటి వరకు మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ క్లైమాక్స్‌కి ఎమోషనల్ అయ్యారు. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు అద్భుతంగా నటించారు. శ్రీరామ్ గొప్ప డైలాగ్స్ రాశారు. ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలతోనే ఈ మూవీని చేశాం. సినిమాని చూస్తే ఇది మా ఇంట్లోనే జరిగినట్టు ఉందే అని ఫీల్ అవుతారు. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో విరాట్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.