
హైదరాబాద్: కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలవడానికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చారు. బిఆర్ఎస్ లోకి వెళ్తారంటూ తప్పుడు ప్రచారం చేశారని జీవన్ రెడ్డిని శ్రీధర్ బాబు బుజ్జగించారు. జీవన్ రెడ్డితో గంటకు పైగా మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డిని కలవడానికి వచ్చామని, జీవన్ రెడ్డితో అనేక అంశాల గురించి చర్చించామని తెలిపారు. జీవన్ రెడ్డి పద్దతిగల నాయకుడిగా 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారని కొనియాడారు. పార్టీ కార్యకర్తలు, నాయుకుల మనోభావాలను తెలియజేశారు. జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంత్రులతో సమావేశం అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై పట్టు వీడలేదని, ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. మంత్రులు పార్టీలో కొనసాగాలని కోరారు. మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ససేమిరా అని..తన నిర్ణయం లో మార్పులేదని, పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానని జీవన్ రెడ్డి అన్నారు. వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ మంత్రులకు జీవన్ రెడ్డి చెప్పారు.