Reading Time: < 1 minute

పెంజర్ల: సాధారణంగా టాపాసులు తీసుకెళ్తున్నామంటే ఎంతో జాగ్రత్తులు తీసుకుంటాం. చిన్న నిప్పు రవ్వ కూడా పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాం. అలాంటిది ఓ లారీ నిండ టపాసులు తీసుకెళ్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఈ లారీ విషయంలో మాత్రం పరిస్థితి తారుమారైంది. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల శివారులో టాపాసులతో వెళ్తున్న లారీకి విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు అంటుకున్నాయి. పూర్తిగా టపాసులతో నిండి ఉండటంతో మంటలు కొంత సమయంలోనే పూర్తి వ్యాపంచాయ. దీంతో టారీ మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టాపాసుల లారీ కావడంతో కాసేపు రోడ్డుపై బీభత్స వాతావరణం నెలకొంది.