
క్రికెట్ అభిమానులు ఎంతాగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకనంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుంది. 18 సీజన్లుగా ట్రోఫీ కోసం పోరాడిన ఆర్‌సిబి జట్టు గత సీజన్‌లో ట్రోఫీని అందుకొని తమ కలను సాకారం చేసుకుంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్‌సిబి.. ఈ సీజన్‌లో కూడా టైటిల్‌ని రిటైన్ చేసుకోవాలని పట్టుదలతో ఉంది.
ఈ మేరకు ఇప్పటికే చిన్నస్వామి స్టేడియంలో రజత్ పాటిదార్ సేన ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన సహచరులకు గట్టి వార్నింగ్ ఇఛ్చాడు. ‘‘గత రెండు, మూడు సీజన్లుగా మనం పడ్డ కష్టానికి ఫలితం గతేడాది దక్కింది. కానీ, ఈసారి మనకు మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సమయాన్నివృథా చేయకండి. 100కి 120 శాతం కష్టపడాలి. ఈ టోర్నీలో సత్తా చాటేందుకు మనమంతా ఉత్సాహం ఉన్నామని మనందరి ముఖాల్లో కనిపిస్తోంది’’ అని విరాట్ పేర్కొన్నాడు.