
తిరుపతి: మా మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏడుకొండల వాడి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులందరం కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి వారి సేవలో తరించామన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు, భక్తులతో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి ముచ్చటించాను. టిటిడి సేవలు ఎలా అందుతున్నాయో భక్తులను అడిగి తెలుసుకున్నారు.