Reading Time: < 1 minute

వాషింగ్టన్: ఇరాన్ నౌకాదళం, వైమానిక దళాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సైనిక పరంగా ఇరాన్ పని అయిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఖర్గ్ ద్వీపానికి సంబంధించి తమ వద్ద ఉన్న ప్రణాళికలు చెప్పలేనని, ఇరాన్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నామని తెలియజేశారు. హోర్ముజ్ జలసంధి గురించి తమకు అవసరం లేదని, యూరప్, జపాన్, చైనా, కొరియాకు అవసరం కాబట్టి వారు జోక్యం చేసుకోవాలని సూచించారు. హోర్ముజ్ జలసంధి తెరిపించేందుకు పెద్ద సంఖ్యలో నౌకలు అవసరమని, హోర్ముజ్ ను తెరిపించేందుకు నాటో సాయం చేయగలదు.. కానీ వారికి ధైర్యం లేదని ట్రంప్ విమర్శించారు.