Reading Time: 2 minutes

CSK Best 11 For IPL: సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంఎస్ ధోనీకి దక్కని చోటు.. ఇర్ఫాన్ పఠాన్ ఏమన్నారంటే? 

Caption of Image.

 CSK Best 11 For IPL: మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిసన్ ప్రారంభం కానుంది. కాగా ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుత బ్యాటింగ్ శైలిని విశ్లేషిస్తూ, పఠాన్ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా సీఎస్‌కే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ధోనీకి చోటు దక్కడం కష్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంఎస్ ధోనీ గత కొన్ని సీజన్లుగా బ్యాటింగ్ చేసేందుకు లోయర్ ఆర్డర్ లో 7, 8 స్థానాల్లోనే వస్తున్నాడు. కేవలం ఒకటి లేదా రెండు ఓవర్లు మాత్రమే ఆడుతున్నారని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు. ధోనీ కేవలం రెండు ఓవర్లు ఆడటం ఆయన అభిమానులకు ఆనందాన్ని ఇవ్వవచ్చు కానీ, జట్టుకు మాత్రం పెద్దగా ఉపయోగపడదని తేల్చి చెప్పాడు. ఆయన ఆడాలనుకుంటే కనీసం నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేయాలి.. లేదంటే ఆ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించడం జట్టుకు మేలు చేస్తుంది అని పఠాన్ సూచించారు. 

గత ఐదు సీజన్లలో ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న బంతుల సంఖ్యను పరిశీలిస్తే అతడి బ్యాటింగ్ టైమింగ్ పూర్తిగా తగ్గుతూ వస్తోంది. గత 5 సీజన్లలో సగటున సీజన్‌కు 114 బంతులను మాత్రమే ఎదుర్కొన్నారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ వల్ల ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు రావడం సులభమైంది, అయితే ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అయినా ఏదో ఒక సమయంలో రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేనని భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేశారు. 

ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న ‘సీఎస్‌కే 12’: 

* సంజు శాంసన్
* ఆయుష్ మ్హారే
* రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్)
* శివం దూబే
* డెవాల్డ్ బ్రెవిస్
* సర్ఫరాజ్ ఖాన్
* కార్తీక్ శర్మ
* ప్రశాంత్ వీర్
*అఖీల్ హొస్సేన్
* మాట్ హెన్రీ
* నూర్ అహ్మద్
* ఖలీల్ అహ్మద్ (ఇంపాక్ట్ ప్లేయర్)

©️ VIL Media Pvt Ltd.