Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని గ్యారెంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలు, 420 హామీలు నీటిమూటలయ్యాయని కెటిఆర్ విమర్శించారు. బడ్జెట్ లో రైతులకు, బిసిలకు జరుగుతున్న అన్యాయంపై, రూ.2500 మహాలక్ష్మి నిధులు ఎప్పుడిస్తారని అడుగుతామని, ఉద్యోగాలపై బొంకుతున్న కాంగ్రెస్ ను నిలదీస్తామని తెలియజేశారు. సంక్రాంతి, ఉగాది గడిచినా రైతుభరోసా పడలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చల్సిందే అని కెటిఆర్ డిమాండ్ చేశారు.