Reading Time: < 1 minute

పాట్నా: కుమారుడిని కొట్టిందని తల్లిని తండ్రి, అత్తింటివారు చంపేసిన సంఘటన బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిరోపూర్ గ్రామంలో రాకేశ్ కుమార్, అను కుమారీ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు ఉన్నాడు. కుమారుడిని తల్లి అను చెంప కొట్టింది. కోపంతో రగిలిపోయిన భర్త అనును చితక బాదాడు. అనంతరం అత్తింటి వారు ఆమెను చితకబాదడంతో స్పృహతప్పికుప్పలిపోయింది. ఆమె చనిపోయిందని అత్తింటి వారు అక్కడి నుంచి పారిపోయారు. అను తండ్రి సుబోధ్ కుమార్ మిశ్రా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించారు.